తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమించడానికి నడుంబిగించారు. శుక్రవారం నాడు జిల్లాల్లో కలక్టరేట్, రాజధానిలో సెక్రటేరియట్ ముట్టడించడానికి కదం తొక్కుతున్నారు. ఈ పోరాటం కనీస హక్కుల కోసమే. కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసమే.
యాజమాన్యాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా మేనేజ్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు జర్నలిస్ట్‌ల ముట్టడి ఆందోళన కలిగిస్తోంది. దీనికి చెక్ పెట్టడం కోసమే అన్నట్టుగా ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పదవిని పొడిగిస్తూ ప్రభుత్వం అకస్మాత్తుగా ఆదేశాలు జారిచేసింది. దీని ఉద్దేశం జర్నలిస్టులను శాంతింపజేయడం కోసమే అల్లం పదవిని పొడిగించారనేది అర్థం అవుతోంది. అల్లంగారు సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక కొలిక్కి తెస్తారా లేదా అనేది చూడాలి.
ప్రెస్ అకాడమి పదవి రెండేళ్లు ఉంటుంది. ఎక్స్‌టెన్షన్ కూడా రెండేళ్ళే చేస్తారు. కానీ ప్రభుత్వం మూడేళ్ళు చేయడం మరీ విచిత్రం.
అయితే జర్నలిస్ట్‌లు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఉద్యమాన్ని నిలువరించలేవని అంటూ సమస్యల పోరాటానికి కదం తొక్కుతున్నారు.