Advertisementt

రజనీలా చిరు అప్ డేట్ అవరా..?

Thu 14th Jul 2016 08:14 PM
rajinikanth,chiranjeevi,ali,chiranjeevi 150th movie,saptagiri,update  రజనీలా చిరు అప్ డేట్ అవరా..?
రజనీలా చిరు అప్ డేట్ అవరా..?
Advertisement
Ads by CJ

హీరోలు ఒక్కో సినిమాకు ఒక్కో హీరోయిన్ తో నటించడానికి ముచ్చటపడతారు. దర్శకుడిని సైతం మారుస్తుంటారు. ఎందుకంటే మోనాటమి వస్తుందని, ప్రేక్షకులకు కొత్తగా కనిపించేందుకు. పాతతరం నటులతో కాకుండా కొత్తతరం బ్యాచ్ తో నటిస్తారు. అలాగైతేనే యువ ప్రేక్షకులకు అప్ డేట్ గా కనిపిస్తుంది.

ఈ విషయంలో తమిళ స్టార్ రజనీకాంత్ అప్ డేట్ గా ఉంటారు. ఆయన సినిమాల్లో ప్యాడింగ్ మారుతుంది. ఉదహారణకి కమెడియన్స్ విషయానికి వస్తే కొన్ని సినిమాల్లో గౌండ్రమణి, సెంథిల్ ఆ తర్వాత వడివేలు, తర్వాత వివేక్ ఇప్పుడేమో సంతానం కాంబినేషన్ లో రజనీ నటిస్తుంటారు. 

మన చిరంజీవి విషయానికి వస్తే తన తాజా చిత్రంలో సీనియర్ కమెడియన్ అలీ కాంబినేషన్ లో నటిస్తున్నారు. తొమ్మిదేళ్ళ విరామం తర్వాత ఆయన నటించిన తొలి సన్నివేశం అలీతో చేసిందే కావడం గమనార్హం. నిజానికి బ్రహ్మానందం, సునీల్, అలీ కామెడీలకు కాలం చెల్లింది. ఇప్పుడు లేటెస్ట్ కమెడియన్స్ రాజ్యమేలుతున్నారు. ముఖ్యంగా సప్తగిరి మంచి ఫామ్ లో ఉన్నాడు. చిరంజీవి అప్ డేట్ గా కనిపించాలంటే లేటెస్ట్ కమెడియన్స్ కాంబినేషన్స్ తో కలిసి నటిస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులే వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం చిరు ఆలోచిస్తాడా...!!?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ