Advertisementt

చిరు 150 లో నిజంగా విజయశాంతి ఉందా?

Thu 14th Jul 2016 05:00 PM
chiranjeevi,vijayashanthi,chiru 150th movie,kathilantodu,megastar chiranjeevi  చిరు 150 లో నిజంగా విజయశాంతి ఉందా?
చిరు 150 లో నిజంగా విజయశాంతి ఉందా?
Advertisement
Ads by CJ

చాలా రోజుల తర్వాత 150 వ సినిమా కత్తిలాంటోడుతో చిరు రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని చరణ్ తన హోం బ్యానర్ కొణిదెల ప్రొడెక్షన్స్ లో నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనా కూడా ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. మొదట అనుష్క అనుకున్న తర్వాత ఆ లిస్టులోకి బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చి చేరారు. అయినా ఇంకా చిత్ర యూనిట్ ఏ డెసిషన్ తీసుకోలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త బయటికొచ్చింది. గతంలో చిరంజీవి తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విజయ శాంతి 'కత్తిలాంటోడు' సినిమాలో నటిస్తుందని సమాచారం. మరి విజయశాంతి పాలిటిక్స్ లోకి వచ్చాక పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. మరి ఈ సినిమాలో కనుక ఆవిడ నటిస్తే కత్తిలాంటోడుతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చినట్టే. అయితే కత్తిలాంటోడు సినిమాలో ఏ పాత్ర కు ఆమెని అడిగారు... మరి దానికి విజయశాంతి ఒప్పుకుందా అనేది తెలియాల్సి ఉంది. వి.వి.వినాయక్ కూడా ఆమె చిరంజీవితో కలిసి నటిస్తే బావుంటుందని అనుకుంటున్నాడట. మరి నిజంగా విజయశాంతి ఈ మూవీ లో నటిస్తుందా! లేక నటించడానికి రెడీ అని విజయశాంతి అన్న మాటను ఇలా పుట్టించేశారా! ఏదిఏమైనా    దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే గానీ..అసలు విషయం తెలియదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ