సినిమా ఫీల్డ్‌లో సెంటిమెంట్ అంటే ప్రాణమిస్తారు. ఫలానా లొకేషన్‌లో తీస్తే సినిమా హిట్ అవుతుందన్నా, ఫలానా కాంబినేష్ అయితే సక్సెస్ గ్యారంటీ అని తేలినా దాన్నే ఫాలో అవుతారు.
తాజాగా 'అల్లరి' నరేష్ సైతం ఇదే నమ్మినట్టు కనిపిస్తోంది. నాలుగేళ్ళుగా వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న ఈ కామెడీ హీరో నటించిన 'సెల్ఫీ రాజా' శుక్రవారం విడుదలకానుంది. ఇప్పటికే ఊరు వాడ తిరిగి ప్రచారం చేశాడు. చివరగా సెంటిమెంట్‌ను సైతం వదలకుండా తన సహ నటుడు శర్వానంద్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించాడని అనుకోవచ్చు.
శర్వానంద్‌తోనే ఎందుకంటే గతంలో వచ్చిన 'గమ్యం' సినిమా గుర్తుండే ఉంటుంది. ఇందులో శర్వానంద్‌తో కలిసి నరేష్ నటించాడు. ఇది హిట్ అయింది. ఇదే కాంబినేషన్‌తో 'నువ్వా-నేనా' తీస్తే వర్కవుట్ అయింది. ఇది గుర్తుకువచ్చే తన 'సెల్ఫీరాజా'కు శర్వానంద్ గొంతు అరువుతెచ్చు కున్నాడట. ఇది కూడా కాంబినేషన్ అవుతుందని, తన 'సెల్ఫీ రాజా' హిట్ గ్యారంటీ అని అల్లరి నరేష్ ఖుషీగా ఉన్నాడట.