Advertisementt

సమంత అడ్వాన్స్ రిటన్ ఇవ్వడానికి కారణం!

Thu 14th Jul 2016 11:25 AM
samantha,dhanush,tamil movie,marriage,naga chaitanya,nagarjuna condition  సమంత అడ్వాన్స్ రిటన్ ఇవ్వడానికి కారణం!
సమంత అడ్వాన్స్ రిటన్ ఇవ్వడానికి కారణం!
Advertisement
Ads by CJ

సమంత, నాగ చైతన్యని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటుందనే వార్తలు జోరుగా సాగుతున్న నేపధ్యం లో ఆమె సినిమా ఆఫర్స్ ని వదులుకుంటూ వస్తుంది. అంతే కాకుండా నాగ చైతన్య ని పెళ్లి చేసుకోవాలంటే ఇక సినిమాలలో నటించకూడదనే నాగార్జున కండీషన్ ని కూడా సమంత ఒప్పుకుందని ప్రచారం జరుగుతుంది. నాగచైతన్యతో పెళ్లికోసమే వచ్చిన అవకాశాలను వదులుకుంటుందని అనుకుంటున్నారు అంతా. అందుకే తమిళం లో ధనుష్ తో కలిసి నటించే భారీ ఛాన్స్ మిస్ చేసుకుందని టాక్. అసలు ఈ సినిమాలో నటించేందుకు సమంత ముందు ఒప్పుకుని అడ్వాన్స్ కూడా తీసుకుందట. కానీ ఎందుకో ఆమె ఈ సినిమాలో చెయ్యనని అడ్వాన్సు కూడా వెనక్కి ఇచ్చేసిందంట. కానీ ఈ విషయమై టాలీవుడ్ లో రకరకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. అయితే అసలు విషయం వేరే ఉందట. ఈ సినిమా పేరుతో ఆ ప్రొడ్యూసర్స్ మరో 3 సినిమాలను తియ్యాలని ప్లాన్ చేస్తున్నారంట. మరి 3  సినిమాలలో నటించాలంటే కనీసం 3  సంవత్సరాలైనా పడుతుందని... ఇలా ఇన్ని సంవత్సరాలు టైం కేటాయించాలంటే కుదరదని సమంత ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందనేది ఈ వార్త సారాంశం. అయినా కూడా తెలుగులో 'జనతా గ్యారేజ్' మినహా ఇంకేం సినిమాలలో ఆమె నటించడం లేదు. అసలు సినిమాలు ఒప్పుకోకుండా ఆమె ఏం చేస్తుందో అని.. దీనికి అంతటికి కారణం నాగ చైతన్యతో పెళ్లి అని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ