Advertisementt

ఇప్పుడు సీన్లు కలిపినా లాభం లేదు..!

Thu 14th Jul 2016 11:01 AM
dil raju,rojulu marayi,maruthi,scenes added,jabardasth apparao  ఇప్పుడు సీన్లు కలిపినా లాభం లేదు..!
ఇప్పుడు సీన్లు కలిపినా లాభం లేదు..!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు, మారుతిల కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన 'రోజులు మారాయి' చిత్రం మొదటి షో నుండే ఫ్లాప్‌టాక్‌ను మూటగట్టుకుంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి తొలగించారు. అయితే మారుతి 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో మారాడని అందరూ భావిస్తోంటే.. మారుతి మాత్రం తన పాత స్టైల్‌ అయిన అడల్ట్‌మూవీని చేశాడు. దీంతో మారుతితో పాటు నిర్మాణ భాగస్వామి దిల్‌రాజుకు కూడా విమర్శలు తప్పలేదు. ప్రస్తుతం ఈ చిత్రంలో రిలీజ్‌కు ముందు ఎడిట్‌ చేసిన 'జబర్దస్త్‌' అప్పారావుపై తీసిన 8నిమిషాల నిడివి కలిగిన హాస్య సన్నివేశాలను కలుపుతున్నారు. బడాబడా హీరోల చిత్రాలే ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన తర్వాత రిలీజ్‌ అయిన చిత్రాలను ఎడిట్‌ చేసినా, లేక అదనంగా జోడించినా ఫలితం లేకుండా పోతోంది. కానీ దిల్‌రాజు, మారుతిలు మాత్రం ఆల్‌రెడీ థియేటర్ల నుండి ఖాళీ అయిన సినిమాకు ఇప్పుడు అదనంగా సన్నివేశాలను జోడించడం చూస్తే ఈమధ్య దిల్‌రాజు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడన్న సంగతి అవగతం అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ