కొన్ని సినిమాలలో కలిసి నటిస్తే వారికి ఎఫైర్ అంటగట్టడం సర్వసాధారణం. ఈ మధ్య నిఖిల్, స్వాతి కలిసి 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి సినిమాలలో కలిసి నటించారు. ఈ సినిమాలలో నటించేటప్పుడే వీరిద్దరికి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ఈ విషయమై స్పందించిన నిఖిల్.. తనకు స్వాతికి ఎలాంటి ఎఫైర్ లేదని తేల్చేసాడు. స్వాతి ఒక అద్భుతమైన నటి అని, ఆమెకు నటనలో మంచి ప్రావీణ్యం ఉందని... మీడియాకు ఇలాంటి స్పైసీ న్యూస్ లు ఉంటేనే మజా కాబట్టి అలా పుట్టిస్తుంటారని చెప్పుకొచ్చాడు. మేమిద్దరం కలిసి కొన్ని సినిమాలలో నటించినంత మాత్రాన ఎఫైర్ ఉందని గాసిప్స్ పుట్టించడం మీడియా కి తగదని..తద్వారా ఇరు కుటుంబాలలో సమస్యలు వస్తాయని..దీనిని మీడియా గమనించాలని నిఖిల్ సూచించాడు. స్వాతి ఎప్పుడు బిజీ గా ఉంటుంది. ఆమెతో ఎప్పుడైనా ఫోన్ లో మాత్రమే మాట్లాడతాను అంతే... దానికి మించి మా ఇద్దరి మధ్య ఏమి లేదని నిఖిల్ చెప్పుకొచ్చాడు.