Advertisementt

ఆ కులం కోసం.. బిజెపి ఆరాటం!

Wed 13th Jul 2016 07:07 PM
bjp,andhra pradesh,haribabu,somu verraju,caste feelings in bjp,venkayya naidu  ఆ కులం కోసం.. బిజెపి ఆరాటం!
ఆ కులం కోసం.. బిజెపి ఆరాటం!
Advertisement

ఇంతకాలం బిజెపికి హిందు అనుకూల పార్టీ అనే పేరుంది. దాంతో మైనార్టీలు అయిన ముస్లింలు, క్రిస్టియన్లు ఆ పార్టీకి దూరంగా ఉండటం జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపిలో కులపోరు తక్కువే. ఎంతో కొంత క్రమశిక్షణ ఉన్న పార్టీగా బిజెపి కి పేరుంది. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల పుణ్యమా? అని ఏపీలో బిజెపిలో కూడా కులరాజకీయాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, కమ్మ, కాపు కులాల విషయంలో ఈ సంగతి అర్దమవుతుంది. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం వైయస్సార్‌సీపీకి వెన్నుదన్నుగా ఉంటోంది. ఇక కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడుకి, ఆయన పార్టీకి పెట్టని గోడలా ఉంది. కానీ గత ఎన్నికల్లో కాపుల్లో మంచి ఇమేజ్‌ ఉన్న పవన్‌ బిజెపి-టిడిపి కూటమికి ఓట్లు వేయాలని కోరడంతో కాపులు టిడిపి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు ఏపీలో కూడా బిజెపి సొంతగా బలపడాలని చూస్తోంది.

ఇటీవల జరిగిన ముద్రగడ వ్యవహారంతో కాపులు ఇప్పుడు టిడిపి కి దూరం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సో... రాష్ట్రంలో తాము సొంతగా బలపడాలంటే కాపులను మచ్చిక చేసుకోవాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. దీంతో ఏపీ బిజెపి అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారంలో బిజెపిలో కూడా కమ్మ, కాపు వర్గాల మధ్య కులపోరు నడుస్తోంది. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ కంభంపాటి హరిబాబు తనకే రెండోసారి కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నాడు. దీనికి వెంకయ్యనాయుడుతో పాటు బిజెపి మంత్రి కామినేని శ్రీనివాస్‌ అనుకూలంగా ఉన్నారు. కానీ ఎన్నిచేసినా కమ్మ సామాజిక వర్గం టిడిపివైపే ఉంటుందని, కాబట్టి కాపు సామాజికవర్గానికి చెందిన సోమువీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ తదితరులు అమిత్‌షాపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటివరకు మత రాజకీయాలతో కాస్త చెడ్డపేరు తెచ్చుకున్న బిజెపి ఇప్పుడు కులం ఊబిలో కూడా కూరుకుపోయిందని చెప్పవచ్చు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement