Advertisementt

అరవింద్ కూడా చిరుకు దూరంగా వుంటున్నాడా?

Wed 13th Jul 2016 06:18 PM
chiranjeevi,allu aravind,allu arjun,haritha haram,cheppanu brother  అరవింద్ కూడా చిరుకు దూరంగా వుంటున్నాడా?
అరవింద్ కూడా చిరుకు దూరంగా వుంటున్నాడా?
Advertisement
Ads by CJ

మెగా కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి అంతర్గతంగా మళ్లీ మనస్పర్థాలు వచ్చాయనే సందేహం మళ్లీ సినీ జనాల్లో కలుగుతుంది. ఇంతకు ముందు ఇలాంటి వార్తలు హల్‌చల్ చేసినా.. కొన్ని రోజుల తర్వాత అన్ని సర్ధుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా చెప్పను బ్రదర్ ఇష్యూ తర్వాత చిరు.. అర్జున్‌కు గట్టిగా క్లాస్ పీకాడని.. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన అల్లు అర్జున్.. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే దిశలో ఆలోచిస్తున్నాడని.. అందుకు తోడుగా డివైడ్ టాక్ వచ్చినా సరైనోడు చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో అల్లు అర్జున్‌కు తనపై తన ఫాలోయింగ్‌పై మరింత విశ్వాసం పెరిగిందని.. అందుకే ఇకపై తన పర్సనల్ ఇమేజ్‌తోనే ఎక్కడికైనా హాజరుకావాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగానే ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో కేవలం తన కుటంబసభ్యులతో మాత్రమే పాల్గొన్నాడని.. చిరంజీవి ఓ స్కూల్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొంటే .. కనీసం అక్కడికి అరవింద్ కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అల్లు అరవింద్ కూడా చిరుకు దూరంగా వుండాలనే నిర్ణయం ఏమైనా తీసుకున్నాడా? అనే అనుమానాలు బయలుదేరాయి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ