రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో తన మనుగడనే కోల్పోయింది. మరోవైపు తెలంగాణను తామే ఇచ్చినప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్‌కు దీనస్ధితి తప్పలేదు. దీంతో అందరూ అయ్యో...పాపం కాంగ్రెస్ అంటూ ఆ పార్టీపై జాలి చూపిస్తున్నారు. ఇందుకు ఇతర పార్టీలు కూడా మినహాయింపు కాదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా కాంగ్రెస్‌ను చూసి జాలివేసిందని తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ నూతన రాజధాని అమరావతితో పాటు ప్రతిజిల్లాలో శాసనసభలో ప్రాతినిద్యం వహిస్తున్న అన్ని పార్టీలకు వారి వారి పార్టీ ఆఫీసులు నిర్మించుకునేందుకు ఏపీ ప్రభుత్వం స్దలాలను కేటాయించడానికి నిర్ణయించుకొంది. అయితే శాసనసభలో ప్రాతినిద్యం లేని కాంగ్రెస్‌కు వాస్తవానికి అమరావతిలో కానీ ఇతర జిల్లాల్లో కానీ స్థలం ఇవ్వాల్సిన పనిలేదు.. ఈ విషయాన్ని చంద్రబాబు వద్ద ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్‌కు స్థలాలు ఇవ్వాల్సినపనిలేదని వాదించారు. కానీ బాబు మాత్రం కాంగ్రెస్ పరిస్థితిపై జాలిపడి పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు కేటాంచాలనే నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ విషయంలో బాబు ఎందుకు కాస్త మెత్తబడ్డాడు? అనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అయింది.