బిజెపికి మొదటి నుండి హిందు అనుకూల ధోరణి ఎక్కువ. అలాగే మిగిలిన వారితో పోలిస్తే బిజెపి నాయకులకు, కార్యకర్తలకు కాస్త దేశభక్తి ఎక్కువే. జాతీయవాదం కూడా వారికి కాస్తమెండు. ఇక హైదరాబాద్‌లో ఎంఐఎం ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఉగ్రవాదులకు, వారి సానుభూతి పరులకు హైదరాబాద్‌లో షల్టర్ ఇస్తోందని ఎన్నోసార్లు రుజువైంది. ఎంఐఎం మద్దతులేనిదే వారికి హైదరాబాద్‌లో మనుగడలేదు. అక్కడ ఎంఐఎం నాయకులు ఏది చెబితే అదే హైదరబాద్‌లో వేదం. ఇటీవల హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలా అరెస్ట్ అయిన వారికి తాను న్యాయ సహాయం చేస్తానని కూడా అసదుద్దీన్ బహిరంగంగానే ప్రకటించాడు. దీనిపై బిజెపి నాయకత్వం మండిపడుతోంది. ముస్లిం ఓట్ల కోసమే మిగతా పార్టీలు ఈ విషయంలో మౌనంగా ఉన్నారని బిజెపి వాదిస్తోంది. ఇందులో న్యాయం ఉంది. ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డి తప్ప మజ్లిస్‌పై కఠినంగా వ్యవహించిన నాయకులు, పార్టీలు లేవు. కాంగ్రెస్‌తో పాటు ఇప్పుడున్న టిఆర్‌ఎస్ కూడా మజ్లిస్‌తో దోస్తీ చేస్తూ ముస్లిం ఓట్ల కోసం వంగి వంగి సలాములు చేస్తున్నాయి. దీంతో తెలంగాణ బిజెపి నాయకులు ఇప్పుడు 'సేవ్ హైదరాబాద్' పేరుతో ఓ ఉద్యమం చేయాలని నిర్ణయించడం సంతోషించదగ్గ విషయం. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ ఆగడాలకు ముక్కుతాడు వేయడంలో బిజెపి ఎప్పుడు ముందుంటుంది. వారి వల్లే ఇప్పటికీ హైదరాబాద్‌లో హిందువులు బతికి బట్టకడుతున్నారంటే అది బిజెపి పుణ్యమే. మరి బిజెపి చేపట్టిన 'సేవ్ హైదరాబాద్' కార్యక్రమం ఎంతవరకు బిజెపికి మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి. ఇప్పుడు హైదరాబాద్‌లోని కుహనాసెక్యులర్ నాయకులను, ప్రజలను బిజెపి ఎలా ఎదిరించి ప్రజల మద్దతు చూరగొంటుందో వేచి చూడాలి...!