Advertisementt

మారుతి వ్యూహం బెడిసింది !!

Tue 12th Jul 2016 06:24 PM
director maruthi,babu bangaram,rojulu marayi flop,venkatesh,dil raju,allu aravind  మారుతి వ్యూహం బెడిసింది !!
మారుతి వ్యూహం బెడిసింది !!
Advertisement
Ads by CJ

'రోజులు మారాయి' ఫలితం 'బాబు బంగారం'పై ఉంటుందా.. ఈ డౌట్ చిత్ర యూనిట్ లో నెలకొంది. మారుతి కథ, స్క్రీన్ ప్లేతో రూపొందిన 'రోజులు మారాయి' ఆశించిన సక్సెస్ పొందలేదు. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదని బయ్యర్లే అంటున్నారు. ఇక మారుతి కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. ఇందులో  వెంకటేశ్ హీరో. 'భలే భలే మగాడివోయి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'బాబు బంగారం' మెుదలైంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. వెంకటేశ్ న్యూ లుక్ ఆకట్టుకుంటోంది. బిజినెస్ ఎంకరేజ్ గా ఉంది. పైగా నయనతార నాయిక కావడం మరో ఆకర్షణ. 

కానీ ఇప్పుడు అంటే 'రోజులుమారాయి' తర్వాత కాలిక్యులేషన్ మారిందనే మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. మారుతి సినిమా అంటే డబుల్ మీనింగ్, వల్గర్ కామెడీ ఉంటుందనే భయం నెలకొంది. వెంకటేశ్ సినిమా అనగానే క్లీన్ కామెడీ, కుటుంబసభ్యులంతా చూసే సినిమా అనే ముద్ర ఉంది. ఇప్పుడది పోతుందా అని అభిమానులు సంశయిస్తున్నారు. 

ఇక 'రోజులుమారాయి' సినిమాపై ఫ్లాప్ ముద్రపడకుండా ఇటీవలే సక్సెస్ మీట్ నిర్వహించి హడావుడి చేశారు. 

ఇలాంటి  ప్రమాదం ఉంటుందనే గతంలో అల్లు అరవింద్ జాగ్రత్త పడ్డాడు. అల్లు శిరీష్ తో 'కొత్తజంట' పేరుతో సినిమా తీసేముందు మారుతికి షరతు పెట్టారు. తన సినిమా కంటే ముందు చిన్న సినిమా ఏదీ చేయకూడదని. ఆ ప్రకారం 'ప్రేమకథా చిత్రమ్' సినిమాకు మారుతి దర్శకత్వం వహించినప్పటికీ పేరు వేసుకోకుండా కెమెరామెన్ కు క్రేడిట్ ఇచ్చారు. సినిమా ఫ్లాపైతే అపవాదు తనపైకి రాకుండా జాగ్రత్తపడ్డాడు. లక్కీగా హిట్ కావడంతో క్రెడిట్ తనదే అన్నాడు. ఇదే ప్రయోగం 'రోజులుమారాయి' సినిమాకు చేశాడు. దర్శకుడిగా పేరు వేసుకోలేదు కానీ చక్రం తిప్పింది మాత్రం మారుతినే. ఈసారి వ్యూహం బెడిసికొట్టిందని మారుతి సన్నిహితులే కామెంట్ చేస్తున్నారు. 

'బాబు బంగారం' సినిమా విషయంలో మాత్రం వెంకటేశ్ నిక్కచ్చిగా ఉండే అవకాశం ఉంది. చీప్ కామెడిని ఆయన ప్రోత్సహించరు. కానీ మారుతి కథ విషయంలోనే అనుమానాలు నెలకొంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ