Advertisementt

టాలీవుడ్: తెలంగాణకు జై ఆంధ్రకు నై..!

Tue 12th Jul 2016 06:21 PM
tollywood,telangana,andhra pradesh,neeru - chettu,haritha haram  టాలీవుడ్:  తెలంగాణకు జై ఆంధ్రకు నై..!
టాలీవుడ్: తెలంగాణకు జై ఆంధ్రకు నై..!
Advertisement
Ads by CJ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో టాలీవుడ్ స్టార్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. మెుక్కలు నాటారు. చిరంజీవి ఆకుపచ్చ కండువ వేసుకుని మరీ మెుక్కనాటారు. ప్రకృతి సమతుల్యత కోసం తమవంతు భాగంగా మెుక్కలు నాటడాన్ని అభినందించాల్సిందే.  అయితే టాలీవుడ్ కు భారీ రెవెన్యూ తెచ్చిపెట్టే ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మన స్టార్స్ మరిచారు. తెదేపా ప్రభుత్వం ఆం.ప్ర.లో 'నీరు - చెట్టు' పేరుతో సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనడానికి స్టార్స్ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళలేదు. పైగా చాలామందికి ఆం.ప్ర. సొంత రాష్ట్రం. చిరంజీవి మెుదలుకుని అనేక మంది సినీ జనాలు వైజాగ్ లో స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థలాలు సైతం అడిగారు. 

అనేక సినిమాలకు ప్రమోషన్ లో భాగంగా ఆం.ప్ర.లోని పలు పట్టణాల్లో తరచుగా సినీ వేడుకలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా నివసించేది తెలుగువారే. మరి టాలీవుడ్ కు కేవలం తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమమే గుర్తుండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'నీరు-చెట్టు' గురించి మర్చిపోవడం చిత్రంగా కనిపిస్తోంది. ఇటు కేసీఆర్ తో దోస్తాని, అటు చంద్రబాబుతో నహీ అనే విధంగా టాలీవుడ్ పోకడ ఉంది. 

మెుక్కలు నాటడం అనేది సామాజిక బాధ్యత. దీన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం పట్ల ప్రజలు ఏమనుకుంటారనే ధ్యాస టాలీవుడ్ కు లేకపోయింది. కనీసం మీడియా ముందు మాట్లాడిన సందర్భాల్లో కూడా ఆం.ప్ర. గురించి ఒక్క మాట కూడా చెప్పలేదంటే వారిలో ఉన్న పక్షపాతం తేటతెల్లమైంది. హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడి ప్రభుత్వానికే మద్దుతుగా ఉంటాం అనే పోకడ సరైంది కాదు. కళాకారులు ప్రాంతం, భాషా తో సంబంధం లేకుండా ఉండాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ