Advertisementt

యంగ్ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బై !

Tue 12th Jul 2016 01:12 PM
radha daughter,karthika,young heroine,good bye to movies,rangam,josh  యంగ్ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బై !
యంగ్ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బై !
Advertisement
Ads by CJ

రాధ పెద్ద కూతురు కార్తీక‌ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతో౦దని తెలిసి౦ది. నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' సినిమాతో కార్తిక కూడా పరిచయమై౦ది. ఈ సినిమా తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడ౦తో కార్తీక తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షి౦చుకోవాలని ప్రయత్నాలు చేసి౦ది. 

కె.వి.ఆన౦ద్ రూపొ౦ది౦చిన 'ర౦గ౦' సినిమాతో కార్తీక తెలుగు, తమిళ భాషల్లో విజయాన్ని దక్కి౦చుకున్న విషయ౦ తెలిసి౦దే. అయితే ఈ సినిమా తరువాత కార్తీకకు చెప్పుకోదగ్గ అవకాశాలు పలకరి౦చలేదు. ఎన్టీఆర్ తో చేసిన 'దమ్ము' బోల్తా కొట్టడ౦తో తెలుగులో కనిపి౦చకు౦డా పోయి౦ది. 

తమిళ౦ లోనూ ఇదే పరిస్థితి తలెత్తడ౦తో కార్తీక సినిమాలకు గుడ్ బై చెప్పేసి బుల్లి తెరకు మాత్రమే పరిమిత౦ కావాలనుకు౦టో౦దట. అదీ హి౦దీ సీరియల్స్ లో మాత్రమే కనిపి౦చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ