Advertisementt

ఏది ఏమైనా దేవిశ్రీని వదలనంటున్నాడు!

Mon 11th Jul 2016 11:58 PM
devisri prasad,koratala siva,janatha garage,ram charan  ఏది ఏమైనా దేవిశ్రీని వదలనంటున్నాడు!
ఏది ఏమైనా దేవిశ్రీని వదలనంటున్నాడు!
Advertisement
Ads by CJ

తన తొలి రెండు చిత్రాలతోనే స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయిన రచయిత కొరటాల శివ. ఆయన తీసిన 'మిర్చి, శ్రీమంతుడు' చిత్రాలు మ్యూజికల్‌గా కూడా మంచి విజయం సాధించాయి. కాగా ప్రస్తుతం కొరటాల శివ తన మూడో చిత్రం ఎన్టీఆర్‌తో 'జనతాగ్యారేజ్‌' ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నారు. తన 'మిర్చి, శ్రీమంతుడు' చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాదే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ తన నాలుగో చిత్రాన్ని నిర్మాత డి.వి.వి. దానయ్యకు చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరో ఎవరు? అనేది ఇంకా బయటకు రాలేదు. రామ్‌చరణ్‌ నటిస్తాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన 'ధృవ' చిత్రం తర్వాత సుకుమార్‌తో చిత్రం చేయనున్నాడు. దీంతో హీరో విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఈ నాలుగో చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తాడని దానయ్య టీం ప్రకటించింది. ఈ చిత్రం మ్యూజికల్‌ సిట్టింగ్స్‌ నవంబర్‌ నుండి ప్రారంభం అవుతాయంట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ