Advertisementt

నయనతార వల్లే బాబుకి క్లారిటీ మిస్!

Mon 11th Jul 2016 08:29 PM
babu bangaram,release problems,nayanthara,venkatesh  నయనతార వల్లే బాబుకి క్లారిటీ మిస్!
నయనతార వల్లే బాబుకి క్లారిటీ మిస్!
Advertisement
Ads by CJ

సినిమా కథ దగ్గరనుండి అన్ని విషయాలలో పక్కా ప్లానింగ్ తో వుండే వెంకటేష్ కి తాజాగా తాను నటిస్తున్న 'బాబు బంగారం' పై క్లారిటీ మిస్ అవుతున్నాడట. దేనివలన అంటే హీరోయిన్ నయనతార వల్ల అంట. అవును నయనతార బాబు బంగారం షూటింగ్ కి సరిగ్గా హాజరవ్వక పోవడమే దీనికి కారణం అట. అసలు బాబు బంగారం షూటింగ్ మొదలైనప్పుడే నయనతార యూనిట్ సభ్యులను ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఆమె సరిగ్గా షూటింగ్ కి హాజరవక సినిమా లేట్ అయిందని సమాచారం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రోబ్లం వచ్చిందట. ఇంకా నయనతార తో 10 రోజులు షూట్ చెయ్యాల్సి ఉందట. కానీ ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ కంప్లీట్ చెయ్యకుండా మరికొన్ని డేట్స్ ఇవ్వాలి అంటే ఎలా కుదురుతుంది అని ఎదురు ప్రశ్న వేస్తుందట. మరి నయనతార 10 రోజులు షూటింగ్ చేస్తేనే సినిమా పూర్తవుతుందని అంటున్నాడు డైరెక్టర్ మారుతి. అసలే ఈ సినిమాకి రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని ఎలా కంప్లీట్ చేస్తారో చూడాలి. అదే వేరే హీరోయిన్ తో అయితే ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ