Advertisementt

కృష్ణవంశీ కోసమేనా పోలీస్ గెటప్!

Mon 11th Jul 2016 08:14 PM
regina,krishna vamsi,nakshtram movie,police getup,heroine,kajal,sandeep kishan  కృష్ణవంశీ కోసమేనా పోలీస్ గెటప్!
కృష్ణవంశీ కోసమేనా పోలీస్ గెటప్!
Advertisement
Ads by CJ

కృష్ణవంశీ- సందీప్ కిషన్ కలయికలో 'నక్షత్రం' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే నిన్నటివరకు ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన కాజల్ అగర్వాల్ అనుకున్నారు. కానీ కాజల్ తమిళంలో అజిత్ సరసన హీరోయిన్ గా అవకాశం రావడం తో కృష్ణవంశీ సినిమా నుండి తప్పుకుందని సమాచారం. కాజల్ ఈ సినిమా నుండి తప్పుకోవడం తో కృష్ణ వంశీ - సందీప్ కిషన్ లు హీరోయిన్ గా రెజీనా ను  ఖరారు  చేశారు. రెజీనా ఇప్పటివరకు నటించిన సినిమాలలో నటన పరం గా మంచి పేరే తెచ్చుకుంది. 'నక్షత్రం' సినిమాలో రెజీనా... సందీప్ కిషన్ కి జోడిగా కనపడనుంది. అలాగే ఇప్పుడీ సినిమాకి సంబంధిచి ఓ స్టిల్ కూడా బయటికివచ్చింది. ఈ స్టిల్ లో రెజీనా పోలీస్ డ్రెస్ లో కనిపిస్తుంది. మరి 'నక్షత్రం' సినిమాలో రెజీనా చేసేది పోలీస్ పాత్రనో లేకపోతే  ఏదైనా సీన్ కోసం ఇలాంటి డ్రెస్ వెయ్యాల్సి వచ్చింది అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెజీనా కి కూడా సరైన అవకాశాలు లేవు. కృష్ణ వంశీ సినిమాలలో చేసిన హీరోయిన్స్ కి మంచి పేరొస్తుంది. మరి ఈ సినిమాతో నైనా రేజీనాకి మంచి పేరొచ్చి అవకాశాలు వెతుకుంటూ వస్తాయేమో చూడాలి మరి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ