Advertisementt

టాలీవుడ్ లో సూర్య రేంజ్ ఇది..!

Mon 11th Jul 2016 08:05 PM
suriya,singam 3 movie,s 3 movie,telugu dubbing,rights,18 crores  టాలీవుడ్ లో సూర్య రేంజ్ ఇది..!
టాలీవుడ్ లో సూర్య రేంజ్ ఇది..!
Advertisement
Ads by CJ

సూర్య - డైరెక్టర్ హరి కాంబినేషన్ లో 'సింగం 1' అండ్ 'సింగం 2' అంటూ మాస్ సినిమాలతో వచ్చి తమిళ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. తమిళ 'సింగం' రెండు వెర్షన్స్ ని 'యముడు 1' మరియు 'యముడు 2' అంటూ తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా 'ఎస్ 3 '  తో సూర్య ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా వున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ లు నటిస్తున్నారు. సూర్య ఇంతకుముందు నటించిన '24' సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించి మంచి హిట్ అందించారు. సూర్య కి తెలుగులో మంచి మార్కెట్టే ఉంది. అందునా ఇంతకు ముందు వచ్చిన సినిమాలు హిట్ అవ్వడం వలన 'ఎస్ 3 ' చిత్రానికి డబ్బింగ్ రైట్స్ రికార్డ్ స్థాయి లో అమ్ముడు పోయాయని సమాచారం. 'ఎస్ 3 '  తెలుగు డబ్బింగ్ రైట్స్ ని రెండు రాష్ట్రాలకు సంబంధించి శివ కుమార్ అనే డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 18 కోట్లకు కొనుగోలు చేసాడని టాక్. సూర్య సినిమాలకు తెలుగులో ఇంత పెద్ద మొత్తం డబ్బింగ్ రైట్స్ రావడం ఇదే మొదటిసారి. అయితే రజిని సినిమాలకు మాత్రమే తెలుగులో పెద్ద మార్కెట్ ఉంది. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి సూర్య 'ఎస్ 3 ' చేరింది. దీన్ని బట్టి అర్థం అవుతుంది 'ఎస్ 3 ' పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో. మరి 'ఎస్ 3 ' తో సూర్య ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ