Advertisementt

రకుల్‌ హ్యాండ్ ఇస్తుందా?

Mon 11th Jul 2016 02:04 PM
rakul preet singh,mahesh movie,hand,more movies,sai dharmaraja,bellamkonda srinivas  రకుల్‌ హ్యాండ్ ఇస్తుందా?
రకుల్‌ హ్యాండ్ ఇస్తుందా?
Advertisement
Ads by CJ

ఈమధ్య కాస్త రేసులో వెనుకబడినా కూడా మరలా రకుల్‌ప్రీత్‌సింగ్‌ మరోసారి బిజీ బిజీ అయింది. ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్‌ 'ధృవ'లో నటిస్తోంది. ఇక సాయిధరమ్‌తేజ్‌ - గోపీచంద్‌ మలినేనిల కాంబినేషన్‌లో ప్రారంభంకానున్న చిత్రం, బోయపాటి శ్రీను-బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ల చిత్రానికి డేట్స్‌ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆమె వద్దకు మహేష్‌-మురుగదాస్‌ల చిత్రంలో కూడా అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెకు ఒకసారి 'బ్రహ్మోత్సవం' చిత్రంలోనే అవకాశం వచ్చినప్పటికి డేట్స్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల ఆ చిత్రం చేయలేకపోయింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మహేష్‌తో నటించాలనేది తన కోరిక అని, ఆయనతో నటించే వరకు పెళ్లి కూడా చేసుకోనని చెప్పింది. మహేష్‌-మురుగదాస్‌ల చిత్రం ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అదే సమయంలో ఆమె వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే సాయి చిత్రం, శ్రీనివాస్‌ల చిత్రాలకు డేట్స్‌ ఇచ్చేసింది. దాంతో ఆమెకు మహేష్‌ చిత్రం విషయంలో మరోసారి డేట్స్‌ ప్రాబ్లమ్స్‌ రావడం ఖాయం అంటున్నారు. మరి మహేష్‌తో నటించడం కోసం ఆమె తన రెండు చిత్రాలను క్యాన్సిల్స్‌ చేస్తుందా? లేక మహేష్‌ చిత్రానికి మరోసారి హ్యాండ్‌ ఇస్తుందా? అనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ