Advertisementt

మాస్‌ బాటపట్టిన విలక్షణ హీరో....!

Mon 11th Jul 2016 01:29 PM
hero suriya,different movies,masss movies,singam 3,ranjit pa,director hari,suriya  మాస్‌ బాటపట్టిన విలక్షణ హీరో....!
మాస్‌ బాటపట్టిన విలక్షణ హీరో....!
Advertisement
Ads by CJ

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో సూర్య. ఆయన ఎప్పుడు విలక్షణ పాత్రలు చేస్తూ తనదైన శైలిలో సాగుతుంటాడు. కానీ ఇటీవల ఆయన చేసిన కొన్ని విలక్షణ చిత్రాలు మంచి పేరును, విమర్శకుల ప్రశంసలను పొందినప్పటికీ సూర్యకు పెద్ద హిట్‌ ఇవ్వలేదు. దాంతో ఆయన ప్రస్తుతం తమిళంలో ఊరమాస్‌ చిత్రాలు చేసే దర్శకులతో చిత్రాలు చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. తమిళంలో దర్శకుడు హరికి ఉన్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూర్య 'సింగంత్రీ' చేస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత గ్రామీణ నేపథ్యంలో ఊరమాస్‌ చిత్రాలు చేసే ముత్తయ్య దర్శకత్వంలో సూర్య నటించనున్నాడు. ఆయన తీసిన 'కొంబన్‌, రాయుడు' చిత్రాలు చూసిన వారికి ఆయనెంత మాస్‌ దర్శకుడో అర్ధమవుతుంది. ఇక రియలిస్టిక్‌ చిత్రాలుగా కనిపించే మాస్‌ చిత్రాలను చేయడంలో దర్శకుడు రంజిత్‌ పా టాలెంట్‌ అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం రజనీతో 'కబాలి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వంలో కూడా సూర్య ఓ చిత్రం చేస్తున్నాడు. 'సింగంత్రీ' తర్వాత సూర్య ముందు రంజిత్‌ పా దర్శకత్వంలో ఆ తర్వాత ముత్తయ్య చిత్రంలో నటిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ