మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో గీతాఆర్ట్స్‌బేనర్‌లో రూపొందుతున్న 'తని ఒరువన్' రీమేక్ 'ధృవ'. అయితే ఈచిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. మెగాఫ్యామిలీలో మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో అల్లుఅరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరో వైపు ఈ చిత్రం టీజర్‌ను బాబాయ్ పవన్‌కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్2న విడుదల చేయాలని రామ్‌చరణ్‌తోపాటు అల్లుఅరవింద్ ప్లాన్ చేస్తున్నారు. చరణ్ కిందటి సినిమా అయిన 'బ్రూస్‌లీ' చిత్రానికి కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి తమ మధ్య విభేదాలు లేవని చరణ్‌తోపాటు అల్లుఅరవింద్ ఈ చిత్రం ద్వారా అభిమానులకు సంకేతాలు పంపాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది. అయితే 'ధృవ' చిత్రాన్ని అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.