Advertisementt

'గ్యారేజ్‌'కి సమంత, నిత్యాల పాత్రలే కీలకమంట!

Sun 10th Jul 2016 04:20 PM
janatha garage,samatha,nithya menen,mohan lal,koratala siva  'గ్యారేజ్‌'కి సమంత, నిత్యాల పాత్రలే కీలకమంట!
'గ్యారేజ్‌'కి సమంత, నిత్యాల పాత్రలే కీలకమంట!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా మైత్రి మూవీస్‌ బేనర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో మోహన్‌లాల్‌, సమంత, నిత్యామీనన్‌లు ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జనతాగ్యారేజ్‌'. ఈ మూవీ ఆగష్టు 12న విడుదలకు సిద్దమవుతోంది. అయితే కొరటాల శివ చిత్రాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్‌షోలకు, సాంగ్స్‌కే కాక కథలో కీలకపాత్రల్లో కనిపిస్తూ ఉంటారు. అలాగే 'జనతాగ్యారేజ్‌'లో సైతం సమంత, నిత్యామీనన్‌ల పాత్రలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. ఐఐటి చదివే ఎన్టీఆర్‌కు క్లాస్‌మేట్‌గా సమంత నటిస్తోందని, ఆమె పాత్ర ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక కథలో మెయిన్‌ట్విస్ట్‌ మోహన్‌లాల్‌, నిత్యామీనన్‌ల మీదనే ఆధారపడి ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. నిత్యా పాత్ర ఈ చిత్రానికి కీలకమైన ట్విస్ట్‌కు మూలకారణంగా ఉంటుందని చెబుతుండటంతో పాటు యూనిట్‌ సభ్యుల సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్ల పాత్రలను కొరటాల శివ అద్భుతంగా డిజైన్‌ చేశాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రంలోని అన్ని పాత్రలకు కథలో ప్రధాన భూమిక ఉంటుందని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ