Advertisementt

'సుల్తాన్‌'ని..'బాహుబలి'తో ఎలా పోలుస్తారు?

Sun 10th Jul 2016 04:16 PM
sulatan,bahubali,1st day collections,different zonars,salman khan,prabhas  'సుల్తాన్‌'ని..'బాహుబలి'తో ఎలా పోలుస్తారు?
'సుల్తాన్‌'ని..'బాహుబలి'తో ఎలా పోలుస్తారు?
Advertisement
Ads by CJ

రంజాన్‌ సందర్భంగా విడుదలైన సల్మాన్‌ఖాన్‌ 'సుల్తాన్‌' చిత్రం విడుదలై అందరి ప్రశంసలు పొందుతోంది. అయితే 'బాహుబలి' కలెక్షన్లతో ఈ చిత్రానికి ముడిపెడుతూ ట్రేడ్‌ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి.ఈ రెండు చిత్రాలు రెండు డిఫరెంట్‌ జోనర్స్‌ చిత్రాలు అయినప్పటికీ పోలికలు మాత్రం పెట్టడం మానలేదు ట్రేడ్‌వర్గాలు. మొదటిరోజు 'సుల్తాన్‌' కలెక్షన్లు 'బాహుబలి'ని దాటలేకపోయాయనేది వాస్తవమే. అయితే 'బాహుబలి' చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా అనువాదమై ఒకేసారి అన్ని భాషల్లో విడుదలైంది. కానీ 'సుల్తాన్‌' చిత్రం విషయంలో అది జరగలేదు. కేవలం హిందీలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా 'బాహుబలి'కి కేవలం టాలీవుడ్‌లోనే 30కోట్లు మొదటిరోజు కలెక్షన్లు వచ్చాయి. ఇలా చూసుకుంటే 'సుల్తాన్‌' తన పరిధిలో ఓ రేంజ్‌లో కలెక్ట్‌ చేసిందనే చెప్పాలి. ఇకపై ప్రతి సినిమాను 'బాహుబలి'తో పోల్చడం మానుకోవడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ