కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్ర టీజర్ ని రంజాన్ ని పురస్కరించుకుని రిలీజ్ చేసిన విషయం తెలిసినదే. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. కేవలం ఎన్టీఆర్ డైలాగ్స్ తోనే ఈ టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ డాన్స్ ల్లో దుమ్మురేపుతాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎన్టీఆర్ డాన్స్ కూడా హెల్ప్ అవుతుందని తాజాగా లీక్ అయినా ఎన్టీఆర్ వీడియో చెబుతుంది. నెట్ లో హల్చల్ చేస్తున్న ఈ లీకైన వీడియో లో ఎన్టీఆర్ వేసిన డాన్స్ సినిమాకే హైలెట్ అవుందంటే అతిశయోక్తి లేదు. ఈ లీక్ వీడియో లో డాన్స్ తో ఎన్టీఆర్ కేక పుట్టించాడు. ఇప్పటికే ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి స్టెప్స్ ఇంకా ఈ సినిమాలో ఎన్ని ఉన్నాయో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమా ఆడియోని ఈ నెలాఖరులో విడుదల చేసి సినిమాని ఆగస్ట్ 12 న విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి కొరటాల శివ అన్ని పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడని సమాచారం.