Advertisementt

నాడు చిరు.. నేడు జగపతి..!!

Sun 10th Jul 2016 03:23 PM
chiranjeevi,the bfg,jagapathibabu,dubbing,hanuman animation movie  నాడు చిరు.. నేడు జగపతి..!!
నాడు చిరు.. నేడు జగపతి..!!
Advertisement
Ads by CJ

చిరంజీవి, జగపతిబాబు మధ్య ఒక పోలిక కుదిరింది. హాలీవుడ్‌ సినిమా 'ది బిఎఫ్‌ జి' చిత్రంలోని ఒక ముఖ్యపాత్రకు జగపతిబాబు డబ్బింగ్‌ చెప్పారు. టాలీవుడ్‌లో ఎందరో హీరోలు ఉండగా ఈ అవకాశం జగపతికే రావడం విశేషం. హీరో నుండి విలన్‌గా మారాక జగపతి వాయిస్‌కు ప్రేక్షకుల్లో క్రేజ్‌ ఏర్పడింది. పైగా అందరికీ తెలిసిన నటుడు కాబట్టి జగపతిని నిర్మాతలు సంప్రదించారు. 

సరిగ్గా పదేళ్ళ క్రితం అంటే 2006లో ఇలాంటి సంఘటనే జరిగింది. యానిమేషన్‌ మూవీ 'హనుమాన్‌' తెలుగులో డబ్బింగ్‌ చేశారు. ఇందులో హనుమాన్‌ పాత్రకి అప్పటి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఇచ్చారు. అంతేకాదు చిరు డబ్బింగ్‌ చెప్పడాన్ని గొప్ప విషయంగా క్రియేట్‌ చేసి, 'హనుమాన్‌' సినిమాను అమ్మేశారు. చిరంజీవి వాయిస్‌ సినిమాకు ప్లస్‌ అవుతుందని భావిస్తే అది కాస్త రివర్స్‌ అయింది. పైగా 'అంజనీపుత్రుడు' చిరంజీవి ఇందుకోసం భారీ పారితోషికం తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. 

'ది బిఎఫ్‌జి' సినిమా డబ్బింగ్‌ వాయిస్‌ కోసం చిత్ర నిర్మాతలకు చిరంజీవి గుర్తుకురాకపోవడం విశేషం. ఈ చిత్రం కోసం హిందీలో అమితాబ్‌ వాయిస్‌ ఇచ్చారు. తెలుగులో మాత్రం జగపతికి అవకాశం దక్కింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ