Advertisementt

త్వరలో తన ఎమ్మెల్యేలకు బాబు క్లాస్ !

Sat 09th Jul 2016 08:08 PM
people not happy,andhra pradesh government work,chandrababu naidu,class,ap mlas  త్వరలో తన ఎమ్మెల్యేలకు బాబు క్లాస్ !
త్వరలో తన ఎమ్మెల్యేలకు బాబు క్లాస్ !
Advertisement
Ads by CJ

ఏపీలో తమ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వ పనితీరు, ఎమ్మేల్యేల పనితీరుపై ఓ సర్వే చేయించాడట. దీనిలో అధిక శాతం ప్రజానీకం ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగానే ఉన్నప్పటికీ ఎమ్మేల్యేల పనితీరుపై అధిక శాతం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ సర్వేలో తేలిందని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత కూడా ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా ఎమ్మేల్యేలు తమ పనితీరును మెరుగుపరుచుకోలేకపోవడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నాడని, త్వరలో అందరు ఎమ్మేల్యేలతో భేటీ నిర్వహించి అందరికీ దిశానిర్దేశనం చేయాలని బాబు అభిప్రాయపడుతున్నాడని సమాచారం. కానీ ఇది చంద్రబాబు స్వయంగా చేయించిన సర్వే కాబట్టి ప్రభుత్వ పనితీరు బాగుందని రిపోర్ట్‌ వచ్చిందని, వాస్తవానికి అధిక శాతం ప్రజలు టిడిపి పనితీరు పట్ల కూడా తీవ్ర అసహనంతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా బాబు తన పనితీరు కూడా మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆయనకు తీవ్ర ఇబ్బందులు ఖాయమని విశ్లేషిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ