గత ఎన్నికల్లో టిడిపి, బిజెపిలు మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేశాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉండగా, ఏపీలోని టిడిపి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉంది. కానీ రానున్న రోజుల్లో ఏపీలో బలపడాలని మోడీతో పాటు అమిత్‌షా భావిస్తున్నాడు. అందువల్లనే కావాలని బిజెపి ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సోము వీర్రాజుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే టిడిపిపైన, బాబు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తోన్న సోము వీర్రాజు నియామకం టిడిపికి పెద్ద షాకే అని చెప్పాలి. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ఎంపీ హరిబాబు, గోకరాజు, పురందేశ్వరి వంటి వారందరితో ఈ విషయం గురించి అమిత్‌షా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి మాణిక్యాలరావును పిలిచినప్పటికీ మరో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌ను మాత్రం పిలవలేదని సమాచారం. కామినేనికి బాబు మద్దతుదారునిగా పేరుంది. అందుకే ఆయన్ను ఈ సమావేశానికి దూరంగా ఉంచారని, అందరితో చర్చించి సోము వీర్రాజును అధ్యక్షునిగా ఎంపిక చేయడం ఖరారైనట్లు, అదే సమయంలో ఓ సీనియర్ బిజెపి నాయకుడు అసంతృప్తితో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.