Advertisementt

దొంగనోట్లు వస్తున్నాయి..జర భద్రం సుమీ!

Sat 09th Jul 2016 07:09 PM
fake notes,amaravathi,andhra pradesh capital,lands,bangladesh,people  దొంగనోట్లు వస్తున్నాయి..జర భద్రం సుమీ!
దొంగనోట్లు వస్తున్నాయి..జర భద్రం సుమీ!
Advertisement
Ads by CJ

ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు భూముల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ప్రతిరోజు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దొంగనోట్ల ముఠాలు కూడా అమరావతిపై కన్నేసినట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుండి ఈ దొంగనోట్లు దేశంలోకి ప్రవేశిస్తూ ఏపీ రాజధాని అమరావతిపై కన్నేస్తున్నాయని సమాచారం. ఇటీవలే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రెండు అతి పెద్ద దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలి కరెన్సీని గుర్తించే మిషన్లు తప్ప మరెవ్వరూ కనిపెట్టలేని విధంగా ఈ నోట్లు ముద్రిస్తున్నారు. ఎక్కువగా రూ.500, రూ.1000ల నోట్లు చలామణిలో ఉండటంతో వీటిని ఎవ్వరు గుర్తించలేకపోతున్నారు. ఈ దొంగనోట్ల ముఠాలు కమిషన్‌ లెక్కన పలువురిని ముగ్గులోకి దించి వాటిని చలామణిలో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాయి. భూములు క్రయవిక్రయాలన్నీ బ్లాక్‌మనీతోనే జరుగుతుండటంతో మోసపోయిన వారు కూడా నోరు విప్పలేకపోతున్నారు. కాబట్టి సామాన్యులు దొంగనోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ