ఈద్ హీరో గా పేరుతెచ్చుకున్న సల్మాన్ ఈ సారి రంజాన్ శుభాకాంక్షలతో 'సుల్తాన్' తో వచ్చి హిట్ కొట్టాడు. 'సుల్తాన్' పాత రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లు కొల్లగొట్టిందని సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ ఒక మల్లయోధుడిగా నటించాడు. దీని కోసం సల్మాన్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. అంతే కాకుండా సల్మాన్ కి జంటగా నటించిన అనుష్క శర్మ కూడా ఇందులో మల్లవిద్య నేర్చుకున్న యువతిగా కనిపించింది. అసలింతకీ ఈ సోదంతా ఎందుకంటే అసలు 'సుల్తాన్' సినిమా కథ ఒరిజినల్ కథ కాదని ఇది తెలుగు సినిమాకు కాపీ అని అంటున్నారు. టాలీవుడ్ లో చాన్నాళ్ల క్రితం వచ్చిన 'భద్రాచలం' సినిమాకు ఇది కాపీ గా చెబుతున్నారు. 'భద్రాచలం' సినిమాలో శ్రీహరి ఒక పల్లెటూరి నుండి వచ్చి మాస్టర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని జాతీయ స్థాయిలో పాల్గొని అవార్డు సంపాదిస్తాడు. ఇప్పుడు 'సుల్తాన్' లో కూడా సల్మాన్ అదే విధం గా మల్లయుద్ధం లో శిక్షణ తీసుకుని ఒలింపిక్స్ లో పతకం సంపాదిస్తాడు. ఈ రెండు కథలు ఒకేలా ఉన్నాయని అంటున్నారు కొంతమంది. 'భద్రాచలం' సినిమా కాపీ చేసి 'సుల్తాన్' తీసారని ఎద్దేవా చేస్తున్నారు. అసలు సల్మాన్ ఇంతకు ముందు నటించిన 'భజరంగీ భాయీజాన్' కూడా కాపీ సినిమానే అని క్రిటిక్స్ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు జనమంతా 'సుల్తాన్' మేనియాలోనే వున్నారు. మరి దేన్ని కాపీ చేసినా సినిమా బావుంటేనే కదా ప్రేక్షకులు ఆదరించేది. మరి ఈ విషయం ఎప్పటికి అర్థం చేసుకుంటారో వీళ్ళు.