Advertisementt

తారక్ కి మహేష్ దర్శకులపై అంత నమ్మకమా?

Sat 09th Jul 2016 06:24 PM
jr ntr,mahesh babu,ntr movie with mahesh babu directors,fans sentiment  తారక్ కి మహేష్ దర్శకులపై అంత నమ్మకమా?
తారక్ కి మహేష్ దర్శకులపై అంత నమ్మకమా?
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' వచ్చే నెలలో ప్రేక్షకులను పలకరించటానికి సిద్దం అవుతుంది. శ్రీమంతుడు వంటి ఘన విజయాన్ని నమోదు చేసిన మైత్రీ మూవీస్ వారి నిర్మాణం లో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్, నిత్య మీనన్, సమంతా తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే. టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి విజయాలు తర్వాత తారక్ కనిపించబోయే చిత్రం కనుక అభిమానుల నుంచి దర్శక నిర్మాతలపై ఒత్తిడి అధికం అవుతునట్టు విశ్వసనీయ సమాచారం. కొరటాల శివ మాత్రం 'జనతా గ్యారేజ్' ఖచ్చితంగా తన హిట్ రికార్డుని కొనసాగించే చిత్రం అని భరోసా ఇస్తున్నారు.

అయితే తారక్ అభిమానులు మరో సెంటిమెంట్ ని బలంగా నమ్ముతున్నారిక్కడ. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసిన దర్శకులు వెంటనే తారక్ తో సినిమా చేస్తే సినిమా మంచి హిట్ అవుతుందనేది వారి నమ్మకం. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో  'దూకుడు' తర్వాత 'బాద్ షా', సుకుమార్ దర్శకత్వంలో  '1 నేనొక్కడినే' తర్వాత వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు తారక్ కెరీర్ లో హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు మహేష్ తో 'శ్రీమంతుడు' తర్వాత కొరటాల శివ..ఎన్.టి.ఆర్ తో 'జనతా గ్యారేజ్' చేస్తున్నాడు. కాబట్టి ఈ చిత్రం హీరో గా తారక్ కి, దర్శకుడి గా కొరటాల శివ కి హ్యాట్రిక్ చిత్రం అవుతుంది అని అభిమానుల నమ్మకం. ఇటీవల విడుదలైన టీజర్ కూడా  రికార్డ్స్ క్రియేట్ చేస్తుండటం తో అభిమానుల సెంటిమెంట్ కి మరింత బలం చేరినట్లయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఎలా అయినా తామే విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఒకరిని మించి మరొకరు భారీ మొత్తం సమర్పించుకునేందుకు ముందుకు వస్తున్నట్లుగా ఇండస్ట్రీ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సో.. సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఖాయం అన్న మాట!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ