తెలుగులో ఓ స్దాయి హీరోలకు 50కోట్లు అనేది ఓ ల్యాండ్ మార్క్‌గా చెప్పుకోవాలి. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన 'అ ..ఆ' చిత్రం జూన్ 2న విడుదలై పెద్దగా హైప్స్ లేకుండానే ఎలాంటి హడావుడి లేకుండా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నితిన్, సమంత ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం నితిన్ కెరీర్‌లో 50 కోట్లు వసూలు చేసిన తొలిచిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో నితిన్ మార్కెట్ రేంజ్ పెరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో మంచి వసూళ్లు సాధించి తెలుగు టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిలవడం మరో విశేషం. మరి ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్‌ను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ చిత్రంతో నితిన్‌కు వచ్చిన ఇమేజ్‌ను ఆయన తదుపరి చిత్రాలతో నిలబెట్టుకుంటాడా? లేదా? అనేది వేచిచూడాల్సిన విషయం.