Advertisementt

నాయుడి గారి బాధలు వర్ణనాతీతం!

Fri 08th Jul 2016 01:22 PM
sabaash naidu,kamal haasan war between shruti haasan and gauthami,shruti haasan controversy  నాయుడి గారి బాధలు వర్ణనాతీతం!
నాయుడి గారి బాధలు వర్ణనాతీతం!
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ మొదటి భార్య కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ లు రెండో భార్య గౌతమిలు ఎప్పుడు కలిసే వుంటారు. గౌతమి వీరితో ఏ ఫంక్షన్స్ కి వెళ్లినా బాగా కలిసిపోయి మా మధ్య ఏ విధమైన ఈగోలు లేవని చెప్పకనే చెబుతుంది. అయితే ఎప్పుడు కలిసి మెలిసి తిరిగే గౌతమి, శ్రుతి హాసన్ మధ్య గొడవలు మొదలయ్యాయని టాక్. ఒకరి పై మరొకరి మాటల యుద్ధం చేసుకుంటున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అసలింతకీ వీరికి గొడవలు ఎందుకొచ్చాయి అంటే అది శ్రుతి తండ్రి కమల్ హాసన్ వల్లే అని అంటున్నారు. అవునండి మీరు విన్నది నిజమే కమల్ వల్లే వారు గొడవ పడుతున్నారట. అసలీ గొడవకి కారణం కమల్ కొత్తగా నటిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రమేనట. ఈ చిత్రంలో కమల్ తో కలిసి శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రానికి గౌతమి కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తుంది. అయితే గౌతమి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ శ్రుతి కి నచ్చడం లేదంట. అంతే కాకుండా ఆమె చేసే పని మీద శ్రుతి కామెంట్స్ కూడా చేసిందని సమాచారం. పాపం కమల్ వీరిద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి తెగ కష్ట పడుతున్నాడట. అయినా కమల్ చెప్పినా వీరు వినకపోగా వీరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయని కోలీవుడ్ మీడియా అంటోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ