Advertisementt

యాంకర్ ఫ్రెండ్స్ తాగి అమ్మాయిని ఏడ్పించారంట!

Fri 08th Jul 2016 01:08 PM
anchor,pradeep machiraju,pub,drink,pradeep friends  యాంకర్ ఫ్రెండ్స్ తాగి అమ్మాయిని ఏడ్పించారంట!
యాంకర్ ఫ్రెండ్స్ తాగి అమ్మాయిని ఏడ్పించారంట!
Advertisement
Ads by CJ

ప్రముఖ టీవీ షో కి ప్రొడ్యూస్ చేస్తూనే యాంకరింగ్ చేస్తున్న ప్రదీప్ మాచిరాజు ఈ మధ్య పార్టీ లో తప్ప తాగి రచ్చ చేసిన వారిలో ఉన్నాడని అంటున్నారు. ప్రదీప్ ఫ్రెండ్స్ తప్ప తాగి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని  ఏడిపించారట. అయితే ఇలా చెయ్యడం తప్పని అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పినా వినకుండా కామెంట్స్ చేశారట. వారు ఎంతకీ తగ్గకపోవడం తో అక్కడ కొంచెం గందరగోళం ఏర్పడిందట. పరిస్థితి చెయ్యి దాటి పోవడం తో క్లబ్ బౌన్సర్లు ప్రదీప్ అండ్ ఫ్రెండ్స్ ని అక్కడినుండి పంపించేశారట. ప్రదీప్ ఫ్రెండ్స్ ఇంత చేస్తున్నా ప్రదీప్ వారిని వారించకుండా చూస్తున్నాడని ఇదంతా చూస్తున్న అక్కడి వారు నువ్వొక సెలెబ్రిటీ అయ్యి ఉండి ఇలా చెయ్యడం తప్పని చెప్పారట. ఎన్నో గొప్పలు చెప్పే సెలెబ్రిటీ లే ఇలా చేస్తే మరి సామాన్యుల పరిస్థితేమిటో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలీమధ్య సెలెబ్రిటీ లు తాగి తందనాలాడుతూ దొరికి పోవడం ఒక ఫ్యాషన్ అయ్యిపోయింది. మరి నిన్నగాక మొన్న పేరు తెచ్చుకున్న ఈ బుల్లితెర యాంకర్ అప్పుడే పెద్ద హీరో లా రెచ్చిపోయి ఫ్రెండ్స్ తో రచ్చ చేస్తూ ఉన్న పేరును పోగొట్టుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ