ఈ రోజుల్లో అనే సినిమాతో అడల్ట్ చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన మారుతి.. ఆ తర్వాత నెమ్మదిగా ఆ బ్రాండ్ నుంచి దూరం కావడానికి ప్రయత్నించాడు. మారుతి గత చిత్రం భలే భలే మగాడివోయ్ చిత్రంతో క్లీన్ ఫ్యామిలీ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇంతలోనే మారుతి తన ఓల్డ్‌స్కూల్‌లో తన మార్క్ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించి 'రోజులు మారాయి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలైన తొలిఆట నుంచే రోజులు మారాయి.. కానీ మారుతి మారలేదు.. అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ చిత్రానికి దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహారించాడు. తొలినుంచి తన శ్రేయోభిలాషులు వద్దంటున్న దిల్‌రాజు రోజులు మారాయిలో పార్టనర్‌గా చేరాడు. అయితే ఈ చిత్రం విడుదల కాగానే దిల్‌రాజుపై కూడా విమర్శలు మొదలయ్యాయి.. అయితే సినిమా విడుదల రోజే దిల్‌రాజు ఫ్యామిలీతో ఆస్ట్రేలియాకు విహారయాత్రకు వెళ్లాడు..అందుకే దిల్‌రాజు సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకు రాలేదు.సో..మారుతి దెబ్బకు దిల్‌రాజు విదేశాలకు వెళ్లాల్సివచ్చిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.