Advertisementt

మరోసారి ఈద్ హీరో అనిపించుకున్నాడు!

Thu 07th Jul 2016 07:47 PM
salman khan,sultan movie,bollywood collections,box office,ed hero,5 years  మరోసారి ఈద్ హీరో అనిపించుకున్నాడు!
మరోసారి ఈద్ హీరో అనిపించుకున్నాడు!
Advertisement
Ads by CJ

గత 5 సంవత్సరాల నుండి రంజాన్ స్పెషల్ గా సినిమాలు రిలీజ్ చేసి సూపర్ హిట్స్ కొడుతున్న సల్మాన్ ఖాన్ ఈ సారి 'సుల్తాన్' సినిమాతో వచ్చి మళ్ళీ హిట్ కొట్టాడు. 2009 లో 'వాంటెడ్' గా వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సల్మాన్ 2010 లో 'దబాంగ్' తో దుమ్ము రేపాడు. ఇక 2011 లో 'బాడీ గార్డ్' గా వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసాడు. 2012 లో 'ఏక్ థా టైగెర్' తో ఒక ఊపు ఊపాడు. ఇక 2014 లో 'కిక్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మన్ననలు పొందాడు. తరవాత 2015 లో 'భజరంగి భాయి జాన్' తో బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టేసాడు. ఇక తాజాగా 2016 లో 'సుల్తాన్' సినిమా రంజాన్ పండుగ స్పెషల్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే రికార్డులను బద్దలుకొట్టేసి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బాక్సింగ్ నేపధ్యం లో తీసిన సినిమా. ఈ సినిమా కోసం సల్మాన్ ప్రత్యేకం గా శిక్షణ తీసుకుని ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా కోసం సల్మాన్ చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలం దక్కింది. ఈ సినిమా గురించి ఎవరిని అడిగినా సినిమా బావుందని దుమ్ము లేపేస్తుందని చెబుతున్నారు. సల్మాన్ ఇందులో త్రీ షేడ్స్ వున్న పాత్రల్లో లవర్ గా, బాక్సర్ గా, నడి వయస్కుడిగా నటించాడు. సల్మాన్ ఈ సినిమాతో మొదటి రోజే కలెక్షన్స్ వర్షం కురిపించి విజయం దిశ గా సాగిపోతున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ