పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కూడా 2018 తర్వాత ఇక రాజకీయాలపై పూర్తి దృష్టిపెట్టే ఆలోచనలో ఉండటంతో తన పొలిటికల్ కెరీర్ మైలేజీగా ఉపయోగపడేలా ఈ చిత్రం తన సినిమా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఉండాలని భావిస్తున్నాడట. అందుకు తగ్గ కథను తయారుచేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. కాగా తెలుగు సినిమాలు కూడా మంచి హిట్టయితే 100కోట్లు దాటడం సులభమే అని ఇప్పటికే కొన్ని చిత్రాలు నిరూపించాయి. కాగా పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' కూడా దాదాపు 100కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ ఫలితం డిజాస్టర్ కావడంతో ఈ చిత్రం రికార్డ్ స్దాయి వసూళ్లు సాధించలేకపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న పవన్, త్రివిక్రమ్‌లు ఈ చిత్రాన్ని పవన్ సినీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా, అలాగే రికార్డుల పరంగా బిగ్గెస్ట్ హిట్ కొట్టే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.