'నేను శైలజ' సినిమాలో నటించిన కీర్తి సురేష్ నటి మేనక వారసురాలన్న విషయం అందరికి తెలిసిందే. ఆమె మొదట్లో మలయాళ చిత్రం తో ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తమిళం లో పరిచయమైంది. తమిళంలో తొలి సినిమా 'రజిని మురుగన్' లో నటించింది. కానీ మొదట విడుదలైంది 'ఎన్న మాయం' సినిమా. ఈ సినిమా అక్కడ అంత విజయం సాధించలేదు. ఆ తర్వాత ఆమె మొదటగా చేసిన 'రజిని మురుగన్' విడుదలై మంచి హిట్టవ్వడమే కాకుండాకీర్తి సురేష్ కు.. నటిగా మంచి పేరును కూడా సంపాదించి పెట్టింది. దీంతో కీర్తి సురేష్ కు తమిళం లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈమె ధనుష్ తో 'తొడరి' సినిమాలో జతకడుతుండగా మరో మంచి అవకాశం ఆమెను వెతుకుంటూ వచ్చింది. అదే విజయ్ తో జోడి కట్టే అవకాశం. తమిళంలో తన పాత్రకు డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. మీకు రోల్ మోడల్ ఎవరని ప్రశ్నిస్తే.. నాకు రోల్ మోడల్ నయనతార అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. అయితే నయనతారలో నచ్చిన గుణం ఆమెకు బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా.. ఆమె అటువైపు వెళ్లకుండా ఇక్కడే నటిస్తూ తనకు స్ఫూర్తినిచ్చింది అని... ఆమె ఫార్ములా తనకు చాలా నచ్చిందని చెప్తుంది కీర్తి.