'సరైనోడు' విజయంతో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ మంచి జోరుమీదున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన హరీష్‌శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా శృతిహాసన్ కాల్షీట్స్ తీసుకున్నారని సమాచారం. వాస్తవానికి బన్నీ తన కెరీర్‌లో ఎప్పుడు రెండోసారి తన హీరోయిన్‌ని రిపీట్ చేయలేదు. కానీ 'రేసుగుర్రం' తర్వాత మరోసారి శృతితో జోడీ కడుతున్నాడు. వరుస విజయాల ఊపులో ఉన్న తన రేంజ్‌ను మరింత పెంచేలా ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని హరీష్‌శంకర్‌ను బన్నీ ఆదేశించాడట. 'గబ్బర్‌సింగ్' తర్వాత తన రేంజ్ ఉన్నట్లుండి పడిపోవడంతో హరీష్‌శంకర్ కూడా ఈ చిత్రం విషయంలో కసి మీదున్నాడు. అలాగే దిల్‌రాజు-బన్నీలది కూడా సూపర్‌హిట్ కాంబినేషన్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఆగష్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.