Advertisementt

నానికి మలయాళీ భామల సెంటిమెంట్‌..!

Thu 07th Jul 2016 03:26 PM
nanni,malayaali heroines,nithya menen,nivetha thomas,anu emmanuel,nani sentiment  నానికి మలయాళీ భామల సెంటిమెంట్‌..!
నానికి మలయాళీ భామల సెంటిమెంట్‌..!
Advertisement
Ads by CJ

వరుసగా 'ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మన్‌' వంటి నాలుగు మంచి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ కలిగిన మీడియం చిత్రాల హీరోగా వెలిగిపోతున్నాడు. పది కోట్లతో మంచి సబ్జెక్ట్‌తో నానితో సినిమా తీస్తే అది ఖచ్చితంగా పెట్టుబడికి రెండింతలు అంటే 20కోట్లను సులభంగా దాటేస్తుందని ఇండస్ట్రీ వర్గాలే కాదు.. ట్రేడ్‌ వర్గాలు కూడా అంటున్నాయి. కాగా విజయాలలో ఉన్న ఈ హీరోకు మరో సెంటిమెంట్‌ను జోడిస్తున్నారు దర్శకనిర్మాతలు. నాని కనుక తన సినిమాలో మలయాళ ముద్దుగుమ్మలతో నటిస్తే ఆ చిత్రం హిట్టవ్వడం ఖాయం అనేది ఆ సెంటిమెంట్‌. దీనికి ఉదాహరణగా వారు పలు చిత్రాలను చూపిస్తున్నారు. నాని కెరీర్‌ను టర్న్‌ చేసిన 'అలా మొదలైంది' చిత్రంలో నాని సరసన నిత్యామీనన్‌ నటించింది. ఈ చిత్రం పెద్ద హిట్‌. ఆ తర్వాత ఆయన కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంలో మాళవిక నాయర్‌ అనే ముద్దుగుమ్మ నాని సరసన నటిచింది. ఈ చిత్రం నానికి మరలా మంచి జోష్‌ను ఇచ్చి, ఓవర్‌సీస్‌లో కూడా నానికి మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఇక తాజాగా 'జెంటిల్‌మన్‌' చిత్రంలో నటించిన నివేదా థామస్‌ కూడా మలయాళీ ముద్దుగుమ్మే. కాగా ప్రస్తుతం నాని 'ఉయ్యాల జంపాల' చిత్ర దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మలయళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. మరి ఈ చిత్రం కూడా హిట్టయితే నాని సెంటిమెంట్‌ మరింత బలపడుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ