ముదిరిపోయినా బెండకాయలా తయారైన రాహుల్ గాంధీ అస్సలు పెళ్లి మాటెత్తకుండానే కాలం గడిపేస్తున్నాడు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ప్రధానిమంత్రి అవ్వాలని ఎప్పటినుండో కలలు కంటున్న 46 ఏళ్ల రాహుల్ గాంధీ ఇక అది జరిగే పని కాదేమో అని ఆలోచించి పెళ్ళైనా చేసుకుందామని డిసైడ్ అయ్యాడట. రాహుల్ గాంధీ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కుతున్నాడు. తన తల్లి సోనియా చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడట. సోనియా.. రాహుల్ కోసం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లోని ఒక కుటుంబం తో ఈ పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. రాహుల్ పెళ్లి ఒక బ్రాహ్మణ యువతితో జరగనుందని సమాచారం. ఈ పెళ్లిని రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానిగా వున్నప్పుడు ఆయన కార్యదర్శిగా పని చేసిన వ్యక్తే కుదిర్చాడని టాక్. అయితే వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ పెళ్లి చెయ్యాలని సోనియా భావిస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ అంతటిని ఒక తాటిలోకి తీసుకొచ్చేందుకు రాహుల్ రాత్రి పగలు కష్టపడుతున్నాడు. మరి ఈ పనులకు పెళ్లి అడ్డంకి అనుకుని ఇప్పటివరకు పెళ్లి ఊసెత్తలేదు. ఇకఇప్పటికైనా పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటున్నాడట రాహుల్.