కొరటాల డైరెక్షన్ లో మోహన్ లాల్- ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'జనతా గ్యారేజ్' టీజర్ ని రంజాన్ స్పెషల్ గా ఈరోజు(జులై 6) న విడుదల చేశారు. సినిమా మీద అంచనాలు పెంచడానికి ఈ టీజర్ ఒక్కటి చాలు. ఎన్టీఆర్ స్టయిల్ మరియు డైలాగ్ డెలివరీ స్పెషల్ అట్రాక్షన్ గా వున్న ఈ టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కూడా మాములుగా లేవ్. 'బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ .... బట్ ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడు పక్కన కూడా ఓ బలముంది. జనతా గ్యారేజ్...ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును' అనే డైలాగ్ తో పాటు ఎన్టీఆర్ బైక్ మీద వచ్చే సీను..అలాగే ఎన్టీఆర్, మోహన్ లాల్ ముస్లింలా నడిచొచ్చి ఈద్ ముబారక్ చెప్పే సీన్ తో కట్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండటం ఈ టీజర్ కి పెద్ద హైలెట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.
Click Here to see the Janatha Garage Teaser