Advertisementt

ఇంక మహేష్ డైరీలో ఖాళీ ఎక్కడ?!

Wed 06th Jul 2016 08:26 PM
mahesh babu,movie index,full,mahesh dairy full,ar murugadoss,vamsi paidipally,puri,trivikram srinivas  ఇంక మహేష్ డైరీలో ఖాళీ ఎక్కడ?!
ఇంక మహేష్ డైరీలో ఖాళీ ఎక్కడ?!
Advertisement
Ads by CJ

సినిమాలు చేస్తాడా? లేదా? అన్నది వేరే విషయం కానీ మహేష్‌బాబు మాత్రం తనతో సినిమా చేయాలని ఆశపడే డైరెక్టర్లందరికీ ఓకే చెబుతూ వస్తున్నాడు. ఇటీవలే 'బ్రహ్మోత్సవం' ఇచ్చిన షాక్‌ నుండి తేరుకుంటున్న మహేష్‌ వరుస కమిట్‌మెంట్స్‌లో సినిమాలకు గ్రీన్‌సిగ్నల్స్‌ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దీని తర్వాత పివిపి బేనర్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి కూడా మహేష్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. వంశీపైడిపల్లి చెప్పిన పాయింట్‌కు మహేష్‌ ఓకే చెప్పాడని, ఈ స్క్రిప్ట్‌ కోసం వంశీ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడని టాక్‌. వీటి తర్వాత 'పోకిరి, బిజినెస్‌మేన్‌'లతో రెండు వరుస విజయాలు అందుకున్న పూరీ దర్శకత్వంలో మహేష్‌ 'జనగణమన' చిత్రం చేయనున్నాడు. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కూడా మహేష్‌ మరోసారి జతకట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా తన డైరీని మూడు నాలుగేళ్లు బిజీ చేస్తూ మంచి జోరుమీదున్నాడు సూపర్‌స్టార్‌. మరి కొత్తగా మరింకెన్ని చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తాడో? వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ