Advertisementt

పోనీలే ఇలాగైనా విడుదలకు నోచుకుంటోంది!

Wed 06th Jul 2016 08:06 PM
sankara,nara rohit,akira movie,mounaguru,sankara release updates,ar murugadoss  పోనీలే ఇలాగైనా విడుదలకు నోచుకుంటోంది!
పోనీలే ఇలాగైనా విడుదలకు నోచుకుంటోంది!
Advertisement
Ads by CJ

అప్పుడెప్పుడో నారా రోహిత్‌, రెజీనా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో 'శంకర' చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో హిట్టయిన 'మౌనగురు'కు రీమేక్‌గా తెరకెక్కించారు. అయితే అదే సమయంలో తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ను కూడా 'మౌనగురు' చిత్రం విపరీతంగా ఆకర్షించింది. హీరో ఓరియంటెడ్‌ చిత్రంగా రూపొందిన 'మౌనగురు'ను హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా పలు మార్పులు చేసిన మురుగదాస్‌ అదే కథతో 'అకీరా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రధానపాత్రను సోనాక్షిసిన్హా పోషిస్తోంది. కాగా 'అకీరా' చిత్రం సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా విడుదలకానుంది. కానీ ఈ చిత్రం విడుదలకు ముందే 'శంకర' చిత్రాన్ని విడుదల చేయలేకపోతే మాత్రం ఈ చిత్ర నిర్మాతలకు తిప్పలు తప్పవు. సో.. ఇప్పుడు 'శంకర' చిత్రాన్ని 'అకీరా' కంటే ముందుగానే విడుదల చేయాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. ఇక 'అకీరా' చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం డైరెక్టర్‌ మురుగదాస్‌కు బాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ హిట్‌ను అందిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. బాలీవుడ్‌లో ఆయన తీసిన 'గజిని', 'హాలీడే' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. మరోసారి అదే మ్యాజిక్‌ను మురుగదాస్‌ రిపీట్‌ చేస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ