Advertisementt

రజినీకాంత్ హెల్త్ పై మరో వార్త..!

Wed 06th Jul 2016 04:47 PM
rajinikanth,robot 2,robot 2 movie shooting,director shankar,rajinikanth health condition  రజినీకాంత్ హెల్త్ పై మరో వార్త..!
రజినీకాంత్ హెల్త్ పై మరో వార్త..!
Advertisement
Ads by CJ

రజినీకాంత్ అమెరికా వెళ్ళినప్పటినుండి అనేక వార్తలు ప్రచారంలో వున్నాయి. ఆయనకు ఆరోగ్యము బాగాలేదని ఆయన ట్రీట్మెంట్ కోసమే అమెరికా వెళ్లినట్లు  ప్రచారం జరిగింది. అంతే కాకుండా కిడ్నీ మార్పిడి కోసమే రజిని అమెరికా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త ప్రచారం లోకి వచ్చింది. డైరెక్టర్ శంకర్.. రజిని కాంబినేషన్లో తెరకెక్కుతున్న రోబో 2 సినిమాకు సంబందించిన వార్త అది. ఆయన రోబో 2 షూటింగ్ కోసం అవసరానికి మించి కష్టపడడం వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందని ఈ వార్త సారాంశం. రోబో2 సినిమాలో రజినీకాంత్ విచిత్రమైన గెటప్ లో కనిపిస్తాడట. అయితే రజిని ఇందులో వాడిన కాస్ట్యూమ్స్ చాలా బరువైనవని... ఆ బరువు దాదాపు 40 కేజీలవరకు ఉంటుందని టాక్. ఒక రోల్ లో సైంటిస్ట్ గాను, మరో రోల్ లో రోబోలాగా కనిపిస్తాడట. ఈ సినిమాలో రోబో రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా వుంటుందట. అయితే ఈ షూటింగ్ ఎండాకాలం లో జరగడం వల్ల రజినీ కి ఆరోగ్యం పాడైందని అధిక వత్తిడి కారణంగానే అలా అయ్యిందని అంటున్నారు. అందుకే ఆయన అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఈ వార్తల్లో సారాంశం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ