ప్రస్తుతం పెద్ద సినిమాలలో అవకాశాలు లేక చిన్న సినిమాలు ఒప్పుకుంటూ బండి లాగించేస్తుంది చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ మధ్య బాలీవుడ్ లో ఒక ఫంక్షన్ కి వెళ్లిన కాజల్ అక్కడ అతిగా అందాలు ఆరబోసి వార్తల్లోకెక్కింది. ఇక మళ్ళీ తాజాగా అమెరికాలో జరిగిన ఆట వేడుకలకు హాజరైన కాజల్ బాగా సన్నబడి కళా కాంతులు లేకుండా డీ గ్లామరస్ గా కనిపించి షాక్ ఇచ్చింది. ఆ మధ్య హీరోయిన్స్ అందరూ సైజ్ జీరో అంటూ తెగ డైటింగ్ లు చేసి సన్నబడి నాజుగ్గా తయారయ్యారు. అయితే ఈ సైజ్ జీరో అందరికి సెట్ కాలేదు. కొంతమంది అందం గా కనిపించినా మరికొంతమంది అంద విహీనం గా తయారయ్యారు. మరి కాజల్ కావాలని సైజ్ జీరో కోసం ట్రై చేసిందా లేక సినిమాలు లేక అలా తయారయ్యిందా అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. మరీ ఇంత పుల్లలా తయారయ్యిన కాజల్ మొహం అసలు కళా కాంతి లేకుండా పోయింది. ఎప్పుడు నిండుగా అందం గా కనిపించే కాజల్ ని అలా చూసి.. మరీ బక్క చిక్కిన కాజల్ ని ఇలా చూసిన వారంతా అయ్యో అసలు కాజల్ కి ఏమైంది అని తెగ బాధపడిపోతున్నారు.