Advertisementt

కొడుకుల పెళ్లి గురించి నాగ్ చెప్పేశాడు!

Tue 05th Jul 2016 06:03 PM
sons marriage,nagarjuna,nag about sons love affair,nagarjuna about sons marriage,naga chaitanya,akhil  కొడుకుల పెళ్లి గురించి నాగ్ చెప్పేశాడు!
కొడుకుల పెళ్లి గురించి నాగ్ చెప్పేశాడు!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున పెద్దకొడుకు నాగ చైతన్య, సమంత లవ్ లో వున్నారని త్వరలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ఎప్పటికప్పుడు మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. అలాగే నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా పెళ్లి పీటలెక్కుతున్నాడని అతని నిశ్చితార్థం అయ్యిందనే న్యూస్ కూడా బయటకొచ్చింది. ఇన్ని జరుగుతున్న నాగార్జున మౌనం గానే వున్నాడు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు నాగార్జున తన కుమారుల గురించి నోరు విప్పాడు. ఒక పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ వారు ఎవరిని ఇష్ట పడితే వాళ్లనే పెళ్లి చేసుకుంటారని, వాళ్ళ నిర్ణయం పట్ల నేను సంతృప్తి గా వున్నానని అన్నారు. అలాగే చైతు నిర్ణయం పట్ల అమల కూడా ఆనందం గా ఉందని అన్నారు. ఇక అఖిల్ కూడా తన లైఫ్ అలాగే తన జీవిత భాగస్వామి పట్ల క్లారిటీ గా వున్నాడని అన్నాడు. అంతే కాకుండా అఖిల్ ఎంగేజ్ మెంట్ అవ్వలేదని ఇంతకు మించి ఇంకేం చెప్పలేనని మిగతా విషయాలు వాళ్ళు మాట్లాడితేనే బావుంటుందని నాగార్జున చెప్పారు. అయితే వీళ్ళ పెళ్లిళ్లు త్వరలోనే ఉన్నాయని నాగార్జున చెప్పకనే చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ