ప్రస్తుతానికి ఏపీ డిజీపీ కేంద్రకార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. డిజీపీ రాముడు విజయవాడ నుండి హైదరాబాద్‌కు అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. కాగా ఏపీ రాజధాని అమరావతిలోనో, లేక విజయవాడలోనో డిజీపి కూడా కార్యాలయాన్ని చూసుకోవాలని చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నా కూడా ఈ విషయాన్ని డిజిపి రాముడు లైట్‌గా తీసుకుంటున్నాడు. తాత్కాలిక సచివాలయంలోని ఓ బ్లాక్‌ను తనకు కేటాయిస్తేనే ఏపీకి వస్తానని ఆయన పట్టుబడుతున్నాడు. అంతేగానీ ఎక్కడపడితే అక్కడ డిజీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనని ఆయన స్పష్టం చేస్తున్నాడు. తాత్కాలిక సచివాలయంలోనే తనకు ఓ బ్లాక్ కేటాయిస్తే మిగిలిన మంత్రులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటుందనే వాదనను రాముడు వినిపిస్తున్నాడు. కానీ తాత్కాలిక సచివాలయంలో వివిధ ప్రభుత్వ శాఖలకే బ్లాక్‌లు కేటాయిస్తుండటం, ఇప్పటికే అన్ని బ్లాక్‌లు నిండిపోవడంతో రాముడు కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. మరి ఈ సమస్యను చంద్రబాబునాయుడు ఎలా పరిష్కరిస్తాడో వేచిచూడాల్సివుంది!