Advertisementt

శర్వానంద్ పై దుమ్మెత్తి పోస్తున్నాడు!

Mon 04th Jul 2016 07:45 PM
sharwanand,rajadhi raja movie,cheran director,nithya menen,director cheran fire on sharwanand  శర్వానంద్ పై దుమ్మెత్తి పోస్తున్నాడు!
శర్వానంద్ పై దుమ్మెత్తి పోస్తున్నాడు!
Advertisement
Ads by CJ

శర్వానంద్ హీరోగా ఈ మధ్య రిలీజ్ అయిన 'రాజాధిరాజా' సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో. ఎప్పుడు వెళ్లిందో ఎవ్వరికి తెలీదు. ఈ సినిమా గురించి హీరో శర్వా కానీ హీరోయిన్ నిత్య  గాని అస్సలు ఎక్కడా మాట్లాడలేదు. 'రాజాధిరాజా' కొన్ని సంవత్సరాలుగా విడుదలకు నోచుకోక ఎట్టకేలకు ఏదోలా మొన్న వారం విడుదలైంది. అసలు ఈ సినిమా శర్వానంద్ కు పెద్దగా మార్కెట్ లేనప్పుడు ఒప్పుకున్న సినిమా. కొన్ని కారణాల వల్ల ప్రొడ్యూసర్ చేతులెత్తేయడంతో  సినిమా కొన్ని రోజులు షూటింగ్ లేకుండా ఆగిపోయింది. పాపం దర్శకుడు చేరన్ ఎలాగో.. ఈ సినిమాను చాలా కష్టాలు పడి పూర్తి చేసి నిర్మాత వెంకటేష్ సహాయం తో విడుదల చేసాడు. కానీ శర్వానంద్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పబ్లిసిటీ గాని, ఒక ఇంటర్వ్యూ కానీ ఇవ్వలేదు. కనీసం ఆడియో వేడుకకి కూడా హాజరవ్వలేదని డైరెక్టర్ చేరన్  తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అలాగే కనీసం హీరోయిన్ కూడా రాలేదని అంటున్నాడు. హీరో వస్తేనే  నేను కూడా పబ్లిసిటీకి హాజరవుతానని హీరోయిన్ అన్నారని అంటున్నాడు చేరన్. ఒక చిన్న డైరెక్టర్ తాను మొదటిగా తీసిన ఈ సినిమాకు కనీస హెల్ప్ చెయ్యకుండా శర్వా తనను అవమానించాడని, అంతే కాకుండా 'రాజాధిరాజా' సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసాడని శర్వానంద్ ని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ సినిమాకు శర్వాకి మేము కోటి రూపాయల రెమ్యూనరేషన్ కి మాట్లాడి 50 లక్షలు ఇచ్చేశామని..కానీ ఈ వ్యవహారం పై ఎవ్వరికి ఫిర్యాదు చెయ్యమని వాళ్ళ పాపానికి వాళ్లే పోతారని అంటున్నారు ఆయన. ఏదిఏమైనా మా సినిమాకు మంచి పేరొచ్చిందని.. చిన్న సినిమా విజయాన్ని ఎవ్వరు ఆపలేరని తనలో తానే సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు చేరన్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ