మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేయడంలో తెలంగాణలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం, ఆంధ్రాలోని టిడిపి ప్రభుత్వం పోటీ పడుతున్నాయి. తెలంగాణలో టిడిపి నాయకుల ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నాడని నానా యాగీ చేస్తోన్న టిడిపి నాయకులు.. ఏపీలో అదే పని చేస్తున్నారు. కాగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టిడిపి ఇచ్చిన పిటిషన్‌ను అక్కడి స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరిస్తున్నాడు. ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చినా ఆయన చర్యలు తీసుకోవడం లేదు. ఇక ఏపీలో కూడా అదే పరిస్దితి రిపీట్ అవుతోంది. తమ పార్టీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇక్కడి స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు వైసీపీ నేతలు అనర్హత పిటిషన్ ఇచ్చినా.. ఆ పిటిషన్‌లో అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ కోడెల తిరస్కరిస్తున్నాడు. మొత్తానికి టిడిపి, టిఆర్‌ఎస్‌లు ఒకే తానులోని ముక్కలని స్పష్టంగా అర్ధం అవుతోంది.