బిజెపి అగ్రనాయకుల్లో సుష్మాస్వరాజ్ ముఖ్యురాలు. కానీ ఆమె అద్వానీ గ్రూప్‌లో కీలకపాత్ర పోషిస్తోంది. దీంతో సుష్మాస్వరాజ్‌కు విదేశాంగ శాఖ ఇచ్చినా కూడా మోడీ మాత్రం ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అసలు సుష్మాస్వరాజ్‌కు పనిలేకుండా చేస్తున్నాడు మోడీ. ఇప్పటికే ప్రధాని అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టి వస్తున్న మోడీ నేరుగా ఆ దేశ ప్రధానులతోనే చర్చిస్తున్నాడు. ఆయన మిగిలిన అన్ని శాఖల కంటే విదేశీ వ్యవహారాలపైనే దృష్టి పెట్టాడు. సాధారణంగా ప్రధానులు విదేశాలకు వెళ్లినప్పుడు విదేశాంగ మంత్రులను కూడా తీసుకొని వెళ్లతారు. కానీ సుష్మాస్వరాజ్ విషయంలో మోదీ ఈ నియమాన్ని పాటించడం లేదు. అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. దీంతో తనకు ప్రాధాన్యత లేకుండా పోతోందని సుష్మా స్వరాజ్ ఆవేదన వ్యక్తం చేస్తోందట. తన శాఖనైనా మార్చమని, లేదా తనకు విదేశాంగ వ్యవహారాల్లో ప్రాముఖ్యం ఇవ్వాలని ఆమె మోడీకి, అమిత్‌షాకే కాదు.. అద్వానీకి కూడా ఫిర్యాదు చేసిందట. మోడీ, అమిత్‌షాలు మాత్రం ఆమె కోరిక విని మౌనం పాటిస్తే.. అద్వానీ మాత్రం ఆమె కోసం మోడీతో మాట్లాడుతానని హామీ ఇచ్చాడని సమాచారం. మరి చివరకు సుష్మా భవిష్యత్తు ఏమిటో? ఎవ్వరికీ అంతుపట్టకుండా ఉంది...!